
హైదరాబాద్ , 27 అక్టోబర్ (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తీవ్ర తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుపాను తీరం వైపు దూసుకొస్తుండటంతో తెలంగాణలోని తూర్పు మరియు ఉత్తర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈరోజు తెలిపింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రాత్రి నుంచి రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో రైతులు, చెట్ల కింద నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల విపత్తులు సంభవించకుండా జిల్లా కలెక్టర్లు మరియు స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ముందస్తుగా సిద్ధం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్