
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
జవహర్నగర్ డంపింగ్ యార్డ్ను తరలించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఈటెల రాజేందర్ చేపట్టిన మహా పాదయాత్ర రెండవ రోజు భారీ జన సందోహం నేపథ్యంలో కొనసాగింది.
జవహర్నగర్ డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసన, వాయు కాలుష్యం, కలుషితమైన భూగర్భ జలాలతో లక్షలాది మంది ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమత మవుతున్నారని, దీనిని నగరానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కొనసాగుతుంది.
ఈ సందర్భంగా రెండో రోజు జరిగిన పాదయాత్ర భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఘట్కేసర్ మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించిన ఈటల రాజేందర్కి ఘనస్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఎంపీ ఈటెల మాట్లాడుతూ.. తనకి మార్గదర్శకులు ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి తమకు మద్దతుగా వచ్చారని తెలిపారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ కోర్టు తీర్పులను పక్కదోవ పట్టించడం వల్ల ఈ సమస్య తీరడం లేదన్నారు. అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు