ఎలమంచిలిలో విద్యుత్ షాక్తో మహిళ మృతి.. విషాదం
అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై పడటంతో, వాటిని తాకిన ఓ మహిళ విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయింది.
One person died after being shocked by a pig trap


అనకాపల్లి జిల్లా , 28 అక్టోబర్ (హి.స.)

అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై పడటంతో, వాటిని తాకిన ఓ మహిళ విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఉదయాన్నే ఈ ఘటన జరగడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఈదురుగాలుల ప్రభావంతో ఎలమంచిలి ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడిపోయాయి. అయితే, రోడ్డుపై పడిన విద్యుత్ తీగలను గుర్తించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఇంటి ముందు ఉన్న సమయంలో మహిళ అనుకోకుండా ఆ తీగలను తాకింది. దీంతో ఆమెకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటివరకు తమ మధ్య ఉన్న మహిళ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande