
అమరావతి: 29 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన 'అర్నబ్' తుఫాను సృష్టించిన బీభత్సం, నష్టపరిహారం మరియు పునరుద్ధరణ చర్యలపై చర్చించేందుకు నేడు (గురువారం ) ఉదయం 10.30 గంటలకు ఏపీ మంత్రిమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది.
ఈ సమావేశాన్ని వినూత్నంగా 'హైబ్రిడ్ విధానం'లో నిర్వహించబోతున్నారు. సచివాలయానికి నేరుగా అందుబాటులో ఉన్న మంత్రులు అమరావతిలో ప్రత్యక్షంగా పాల్గొననుండగా, క్షేత్రస్థాయిలో తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న మిగిలిన మంత్రులు వర్చువల్‌గా (వీడియో కాన్ఫరెన్స్) ఈ భేటీకి హాజరవుతారు.
కేబినెట్ సమావేశంలో చర్చించనున్న ప్రధాన అంశాలు:
-
తక్షణ సహాయక చర్యల పురోగతి: బాధిత కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన బియ్యం, ఉచిత నిత్యావసరాల పంపిణీ మరియు ఆర్థిక సాయం అందుతున్న తీరుపై సమీక్ష.
-
మౌలిక సదుపాయాల పునరుద్ధరణ: దెబ్బతిన్న విద్యుత్ సరఫరా, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడంపై అధికారులకు మార్గనిర్దేశం.
-
పంట మరియు ఆస్తి నష్టం అంచనా: రాష్ట్రవ్యాప్తంగా 3.08 లక్షల హెక్టార్లకు పైగా జరిగిన పంట నష్టం మరియు వ్యాపారులు, మత్స్యకారుల నష్టాలపై సమగ్ర నివేదికల పరిశీలన.
-
కేంద్ర సహాయం కోరడం: తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాలను వెంటనే పంపాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం లేఖ రాసిన నేపథ్యంలో, కేంద్రం నుంచి రావాల్సిన సహాయంపై చర్చ.
ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు తుఫాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi