ప్రభుత్వ విధుల్లో గైర్హాజరు.. ఏపీలో 70 మంది వైద్యులపై తొలగింపు చర్య
ప్రభుత్వ వైద్య వ్యవస్థలో విధులకు హాజరు కాకుండా దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న వైద్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
Doctors


అమరావతి , 03 అక్టోబర్ (హి.స.)ప్రభుత్వ వైద్య వ్యవస్థలో విధులకు హాజరు కాకుండా దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న వైద్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఒక సంవత్సరానికి పైగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 70 మంది ప్రభుత్వ వైద్యులను సర్వీసు నుంచి తొలగించింది.

ఈ చర్య AP Civil Services (CCA) Rules, 1991లోని Rule 20 కింద నిర్దేశిత ప్రక్రియను అనుసరించి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముందుగా సంబంధిత వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వారి వివరణలను పరిశీలించడం వంటి ప్రక్రియ తర్వాత తొలగింపు నిర్ణయం తీసుకొనున్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది అందుబాటులో ఉండటం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుకు కీలకం. ముఖ్యంగా గ్రామీణ, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉన్న సందర్భాల్లో అనుమతి లేకుండా దీర్ఘకాలం గైర్హాజరు కావడం సేవలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విధుల పట్ల బాధ్యతను పెంచేందుకు శాఖ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande