
అమరావతి , 03 అక్టోబర్ (హి.స.)విజయవాడలో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పరిశుభ్రత, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణలో కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, స్థానిక సంస్థలకు అవార్డులు అందజేశారు. మొత్తం 2,174 స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రకటించగా, వాటిలో 130 రాష్ట్రస్థాయి, 2,044 జిల్లా స్థాయి అవార్డులు ఉన్నాయి.
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, బస్ స్టేషన్లు, పరిశ్రమలు, స్వచ్ఛత కార్మికులు తదితర విభాగాలు ఇందులో ఉన్నాయి.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల్లోకి శుద్ధి చేయని మురుగునీరు, వ్యర్థాలు విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల్లోకి శుద్ధి చేయని మురుగునీరు చేరడం వల్ల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్