
అమరావతి , 03 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించింది. 2026 ఖరీఫ్ సీజన్లో వర్షపాతం లోటు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు, ఎల్నినో ప్రభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో 283 మండలాలను తీవ్ర కరువు, మరో 105 మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా వర్గీకరించినట్లు అధికారులు తెలిపారు.
జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో నమోదైన సగటు వర్షపాతం సాధారణ స్థాయితో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంది. ఈ కాలంలో సుమారు 53.4 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా కరువు పరిస్థితులపై అంచనా ప్రక్రియను మరింత ఆలస్యంగా చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ ప్రకటనని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్