
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)
ఉత్తరాంధ్ర మకుటమైన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరు, సిటీ కోడ్‌కు సంబంధించి నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు ఈ ఎయిర్‌పోర్ట్ వివరాల్లో VTZ కోడ్‌తో పాటు అనుబంధంగా 'భోగాపురం సిటీ' అని వ్యవహరిస్తూ వచ్చారు.
అయితే, ఈ ఏడాది నవంబరు 21 నుండి ఎయిర్‌పోర్ట్ కోడ్‌ను యథాతథంగా VTZ గానే ఉంచుతూ, సిటీ పేరును మాత్రం భోగాపురానికి బదులుగా అధికారికంగా ‘విశాఖపట్నం’ గా మారుస్తున్నట్లు ఐఏటీఏ స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్, గుర్తింపును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
విదేశీ ప్రయాణికులు, పర్యాటకులు మరియు పారిశ్రామికవేత్తలకు విశాఖపట్నం గ్లోబల్ హబ్‌గా సుపరిచితం. ఐఏటీఏ తాజా నిర్ణయంతో విమానాల బుకింగ్స్, గ్లోబల్ నేవిగేషన్ సిస్టమ్స్‌లో భోగాపురం స్థానంలో 'విశాఖపట్నం' అని కనిపించనుంది. ఇది విమానయాన రంగానికి మాత్రమే కాకుండా, విశాఖపట్నం చుట్టూ టూరిజం, ఐటీ, వ్యాపార అవకాశాలు పెరగడానికి ఎంతగానో తోడ్పడనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi