బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంపై కాంగ్రెస్ దృష్టి
తెలంగాణలో బీసీ రాజకీయ ప్రాతినిధ్యం మరోసారి ప్రధాన రాజకీయ చర్చగా మారింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ భవిష్యత్లో రాష్ట్రానికి బీసీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.
Telangana govt


హైదరాబాద్ , 05 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో బీసీ రాజకీయ ప్రాతినిధ్యం మరోసారి ప్రధాన రాజకీయ చర్చగా మారింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ భవిష్యత్లో రాష్ట్రానికి బీసీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.

బీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్తో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీసీ జనాభా, కులగణన, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కీలక చర్చలుగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనను చారిత్రాత్మక చర్యగా కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అదే సమయంలో బీసీలకు స్థానిక సంస్థలు, శాసనసభ, శాసన మండలి, మంత్రివర్గం, ప్రభుత్వ కార్పొరేషన్లలో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం చెబుతోంది అన్నారు.

బీసీలకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అంశంగా మరువచాన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande