కరెంటు కోతలపై కామారెడ్డి జిల్లా రైతుల ధర్నా
కరెంటు పూతలపై కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల రైతులు కన్నెర్ర చేశారు.
Farmers


కామారెడ్డి, 05 అక్టోబర్ (హి.స.)

కరెంటు పూతలపై కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల రైతులు కన్నెర్ర చేశారు. అస్తవ్యస్తమైన విద్యుత్తు సరఫరాా పై మండలంలోని వెల్పుగొండ, ఫరీద్ పేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ని గ్రామాల రైతులు సోమవారం ఉదయం కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.

ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేవలం 12 గంటల విద్యుత్ సరఫరా చేయడం, అందులో నాణ్యత లోపించడం వల్ల బోర్ మోటార్ పంపుసెట్లు కాలిపోయి ఇటు పంటలు ఎండిపోవడం తో పాటు అటు ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు.

12 గంటల కరెంటు సరఫరా లో సాంకేతిక ఇతర కారణాల తో అంతరాయం ఏర్పడడంతో 10 గంటలు కూడా విద్యుత్ సరఫరా జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, ఎన్పీడీసీఎల్ అధికారులు రైతులను సముదాయించడంతో ఆందోళన విరమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande