గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. అక్టోబర్ 7న తులం ఎంతంటే..?
బంగారం ధరలు అంచనాలకు అందని రీతిలో మార్పులకు లోనవుతున్నాయి. ఈ వారం మొదట్లో స్థిరంగా ఉన్న ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి.
Bullion-Market-Gold-Silver


ముంబై, 07 అక్టోబర్ (హి.స.)బంగారం ధరలు అంచనాలకు అందని రీతిలో మార్పులకు లోనవుతున్నాయి. ఈ వారం మొదట్లో స్థిరంగా ఉన్న ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి.

దేశంలో మేలిమి బంగారం ధర రూ.1000 మేర పెరిగి మరోసారి రూ.1.5 లక్షల మార్కును దాటింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,230గా ఉంది. ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,37,710కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.

బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..?

దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,50,230 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,710 వద్ద ట్రేడవుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,230గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,710 వద్ద కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,010 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,710గా కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,230 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,710గా కొనసాగుతున్నాయి.

దేశంలో సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు స్వల్పంగా తగ్గగా.. దేశంలోనూ అదే బాటలో నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోండగా.. మంగళవారం రూ.2.35 లక్షలుగా ఉన్నాయి.

-హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రేడవుతుండగా.. మంగళవారం రూ.2.45 లక్షల వద్ద స్దిరపడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande