
అమరావతి, 08 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 9 తేదీన అంటే రేపు పోలవరం జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా కాకవాడ, రాకోట గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాకోటలో వెదురు హస్తకళల ప్రదర్శనను సందర్శించడంతో పాటు రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్థులతో పరస్పరం మాట్లాడనున్నారు. అనంతరం కాకవాడలో నిర్వహించనున్న ‘అడవి తల్లి బాట’ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో హెలిప్యాడ్, సభా వేదిక, రహదారులు, బారికేడింగ్, భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. పర్యటనకు సంబంధించిన పనులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ