తిరుపతి శ్రీ సిటీలో మళ్లీ అగ్నిప్రమాదం...మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీ వెంచర్లో మళ్లీ ఈ రోజు(గురువారం) ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
fire


తిరుపతి , 08 అక్టోబర్ (హి.స.)తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీ వెంచర్లో మళ్లీ ఈ రోజు(గురువారం) ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు, పరిశ్రమ కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. భారీగా ఎగిసిపడుతున్న మంటల ధాటికి కంపెనీలోని ముడిసరుకు, యంత్రాలు కాలి బూడిదవుతున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. స్వల్ప అగ్నిప్రమాదం జరగడం వల్ల ప్రాణనష్టమేమీ జరగలేదని.. కానీ ఆస్తినష్టం వాటిల్లిందని పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande