
అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్కు మరో రెండు విమానాశ్రయాల ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. కుప్పం, శ్రీకాకుళంలో ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రాంతీయ విమాన కనెక్టివిటీని పెంచేందుకు ఈ నిర్ణయం ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తున్నారు.
కుప్పం విమానాశ్రయానికి సుమారు రూ.734 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లోని ఏడు గ్రామాల్లో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును 2026–27 సంవత్సరానికి పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో బిడ్డింగ్కు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల జాబితాలో కేంద్రం చేర్చినట్లు సమాచారం.
శ్రీకాకుళం విమానాశ్రయం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు, పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధి చెందేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్