మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ISRO PSLV PS4

శ్రీహరికోట, 08 అక్టోబర్ (హి.స.)

ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన 2,232 కిలోల బరువున్న ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఇప్పటికే షార్లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాకెట్ రెండు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు.

మూడు దశల అనుసంధానం అనంతరం రాకెట్ శిఖర భాగాన ఎన్వీఎ్స-03 ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande