పేదలకు ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి 45 రోజుల గడువు.. మంత్రుల కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు మూడు సభ్యుల మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, 45 రోజుల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Ap govt


అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు మూడు సభ్యుల మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, 45 రోజుల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖాళీగా ఉన్న ప్లాట్లు, గతంలో లబ్ధిదారులకు కేటాయించినా వినియోగంలోకి రాని స్థలాలు, అర్హులైన వారికి స్థలాల కొరత వంటి అంశాలను కమిటీ పరిశీలించనుంది.

ఇప్పటికే లేఅవుట్లలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని అర్హులైన వారికి కేటాయించే అవకాశాలను పరిశీలించనున్నారు. గతంలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసినా వారు వినియోగించని స్థలాల విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం, అవసరమైతే కేటాయింపులను రద్దు చేసి కొత్త అర్హులకు స్థలాలు ఇవ్వడం వంటి అంశాలను కమిటీ పరిశీలించనుంది.

ఇటీవల నిర్వహించిన ఆవాస్ సర్వేలో సుమారు రెండు లక్షల మంది ఇళ్ల స్థలాలు అవసరమైన వ్యక్తులుగా గుర్తించబడినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరికి అవసరమైన భూమిని ఎలా సమీకరించాలి, ఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించాలి అనే అంశాలపై కూడా కమిటీ దృష్టి పెట్టనుంది.

పేదల గృహ నిర్మాణ కార్యక్రమాల్లో ఇళ్ల నిర్మాణానికి ముందు స్థలం అందుబాటులో ఉండటం అత్యంత కీలకం. స్థలం ఉన్నా వివిధ రికార్డు సమస్యలు, కేటాయింపు సమస్యలు, లేఅవుట్లలో ఖాళీ ప్లాట్ల వినియోగం లేకపోవడం వంటి కారణాలతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 45 రోజుల కాలపరిమితి విధించడం ద్వారా అధికార యంత్రాంగంపై బాధ్యత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande