భారీ నష్టాలలో దేశీయ స్టాకు మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు దారుణంగా కుదేలయ్యాయి.
Stock market


ముంబై, 08 అక్టోబర్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు దారుణంగా కుదేలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కసారిగా కుప్పలాయి. తాజా సమాచారం ప్రకారం ఇవాళ ట్రేడింగ్ లో సెన్సెక్స్ సుమారు 1100 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ సుమారు 365 పాయింట్లు పడిపోయింది. ఉదయం నుంచి ట్రేడింగ్లో స్టాక్మార్కెట్లు పేలవ ప్రదర్శన కనబరిచాయి. బుధవారం ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్టాక్మార్కెట్లు భిన్నంగా రియాక్ట్ అయ్యాయి. రెండు స్టాక్ ఎక్సేంజీల్లో ఒక శాతం మేర ట్రేడింగ్ పడిపోయింది.

రెపో రేటు పెంచడం వల్ల ఇన్వెస్టెర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో నిఫ్టీ 22,357 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఆ సమయంలో నిఫ్టీ సుమారు 245 పాయింట్లు కోల్పోయింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 71,947 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. సుమారు 691 పాయింట్లు కోల్పోయింది. రెండు ఎక్సేంజీల్లో ట్రేడింగ్ పడిపోవడంతో.. మార్కెట్ నుంచి సుమారు 8.5 లక్షల కోట్లు ఆవిరైనట్లు తెలుస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande