
ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.)ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో రెండో రోజు , ఈరోజు(గురువారం) పర్యటిస్తున్నారు.ఈ పర్యటన సందర్భంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రయోజనాలపై చర్చలు జరుపుతున్నారు.
ఈరోజు(గురువారం) జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమైన సీఎం రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలు అందజేశారు.ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత రాకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలో 62 లక్షల మంది ఇళ్లకు కుళాయి కలెక్షన్లు ఉన్నాయని, మరో రెండు లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అదించేలా ఇప్పుటికే శంకుస్థాపన చేశామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఐదు నదుల అనుసంధానంపైనా చంద్రబాబు సీఆర్ పాటిల్తో చర్చించారు.
మూడు రాష్ట్రాల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పరస్పర సహకారం, సమన్వయం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను త్వరితగతిన చేపడుతున్నట్టు కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో... నిర్వాసితుల సమస్యల పరిష్కారం.. పునరావాస పనులకూ అంతే ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పోలవరానికి ఎలాంటి నిధుల కొరత రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV