
ముంబై, 08 అక్టోబర్ (హి.స.)అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒక రోజు పెరిగితే మరుసటి రోజు తగ్గాల్సిందే అన్నట్టుగా ధరల తీరు ఉంటోంది. వాస్తవానికి బులియన్ మార్కెట్లో ఒక్కోసారి బంగారం ధర పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి.. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులు.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పలు వెబ్సైట్లలో ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,49,560గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,37,090 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం నగరంలో వెండి ధర రూ.2,44,900 వద్ద కదలాడుతోంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,560, 22 క్యారెట్ల ధర రూ.1,37,090 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,560 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,090 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,690, 22 క్యారెట్ల ధర రూ.1,37,240 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 గా కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,560, 22 క్యారెట్ల ధర రూ.1,37,090 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,580, 22 క్యారెట్ల ధర రూ.1,37,110 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,49,560, 22 క్యారెట్ల ధర రూ.1,37,090 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV