
మార్కాపురం, 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారదర్శకంగా మొత్తం లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు మార్కాపురం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి ఆయేషా బేగం ఈ రోజు గురువారం తెలిపారు.
కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ విజయ సునీత ఆధ్వర్యంలో మరియు ప్రత్యక్ష పర్యవేక్షణలో లాటరీ నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే నేరుగా జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.
మార్కాపురం జిల్లాలో మద్యం వేలం పాట కార్యక్రమం పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. మార్కాపురం జిల్లాలోని 21నమద్యం షాపుల కేటాయింపు కోసం పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించారు.
మార్కాపురం జిల్లా పరిధిలో నోటిఫై చేసిన 21 మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 9 మద్యం దుకాణాలకు రేపు డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించనున్నారు.
జిల్లాలోని 21మద్యం దుకాణాలకు 1872 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV