భారతీయ సినిమా ఒక గొప్ప నటుడు నానా పటేకర్.....పవన్ కల్యాణ్
ప్రముఖ నటుడు నానా పటేకర్ ఆకస్మిక మరణంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నానా పటేకర్ మృతి తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సంతాపం ప్రకటించారు. .
భారతీయ సినిమా ఒక గొప్ప నటుడు నానా పటేకర్.....: పవన్ కల్యాణ్


అమరావతి, 08 అక్టోబర్ (హి.స.)ప్రముఖ నటుడు నానా పటేకర్ ఆకస్మిక మరణంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నానా పటేకర్ మృతి తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సంతాపం ప్రకటించారు.

‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ... ప్రముఖ నటులు నానా పటేకర్ ఆకస్మిక మరణ వార్త తెలిసి చింతిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు నానా పటేకర్ అని కొనియాడారు. ‘క్రాంతివీర్’ చిత్రంలో ఆయన నటన మరచిపోలేనిదన్నారు.

ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోయే గొప్ప నటుడు నానా పటేకర్ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ముఖ్యంగా ‘క్రాంతివీర్’ సినిమాలో ఆయన నటనను ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నాడు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుని వాటికి తనదైన శైలిలో ప్రాణం పోసిన నానా పటేకర్ భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సినిమా రంగంలోనే కాకుండా భారత సైన్యంలోనూ నానా పటేకర్ గౌరవపూర్వకంగా సేవలందించారని పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశంలో ప్రస్తావించారు. దేశం పట్ల ఆయనకున్న గౌరవం, సేవాభావాన్ని గుర్తుచేసుకున్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande