ఈనెల 12 నుంచి మొదలవనున్న తిరుమల బ్రహ్మోత్సవాలు
ఈనెల 12 నుంచి మొదలవనున్న తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల


తిరుమల , 08 అక్టోబర్ (హి.స.)తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 12 నుంచి దసరా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.ఈ ఉత్సవాలకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది పెరటాసి మాసం, నవరాత్రి కారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన గరుడ సేవ ఈ నెల 16న నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమలకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు.. దీంతో టీటీడీ ఆ రోజు బైక్లు, కార్లను కొండపైకి అనుమతించదు. టీటీడీ, పోలీసులు, విజిలెన్స్ కలిసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈసారి ముందుగానే తిరుపతిలోనే ఐదు చోట్ల వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో భక్తులు పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ల బ్యానర్లను ఏర్పాటు చేశారు.

సొంత వాహనాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుపతి నగరంలో ఐదు చోట్ల విశాలమైన పార్కింగ్ మైదానాలను అధికారులు సిద్ధం చేశారు. కొత్తగా వచ్చే భక్తులు పార్కింగ్ ప్రదేశాలను సులభంగా చేరుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ క్యూఆర్ కోడ్లతో కూడిన భారీ బ్యానర్లను బుధవారం తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహన రకాన్ని బట్టి, ఆ క్యూఆర్ కోడ్ను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే చాలు, నేరుగా పార్కింగ్ లొకేషన్ రూట్ మ్యాప్ కనిపిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande