
న్యూఢిల్లీ, 01 నవంబర్ (హి.స.)
నేపాల్‌లోని
అత్యంత లోతైన సరస్సుగా పేరుగాంచిన ‘షె-ఫోక్సుండో’ ( Shey-Phoksundo)
దర్శనానికి వెళ్లిన
ఆరుగురు భారతీయ పర్యాటకులు భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయారు.వారి జాడ లభ్యం
కాకపోవడంతో సంబంధిత అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
సమాచారం
ప్రకారం,ఈ బృందంలో ఇద్దరు
మహిళలు మరియు నలుగురు పురుషులు ఉన్నారు.వీరంతా డోల్పా జిల్లాలోని దెవో భాగం నుంచి
షె-ఫోక్సుండో సరస్సు వైపు ట్రెకింగ్ చేస్తూ ప్రయాణిస్తున్న క్రమంలో నుమ్‌లా పాస్
మరియు బాగ్లా పాస్ ప్రాంతాల్లో తీవ్ర హిమపాతంలో చిక్కుకున్నారు.బంగాళాఖాతంలోర్పడిన
‘అర్నాబ్’ తుఫాను ప్రభావంతో హిమాలయ ప్రాంతాల్లో వాతావరణం ఉన్నట్లుండి మారిపోయి,భారీగా మంచు కురిసింది.
ప్రతికూల
వాతావరణం మరియు ఎత్తైన కొండల దారుల వల్ల ముప్పు ఉందనే స్థానికుల హెచ్చరికలను
పక్కనబెట్టి వారు ముందుకు సాగడం వల్ల ఈ ప్రమాదం తలెత్తింది.వారు తిరిగి వస్తున్న
క్రమంలో మంచు దిబ్బల్లో చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.
కొండ
ప్రాంతాలలో మొబైల్ నెట్‌వర్క్ సంకేతాలు అందుబాటులో లేకపోవడంతో వారి స్థానాన్ని
నిఖార్సుగా గుర్తించడం కష్టతరంగా మారింది.డోల్పా జిల్లా కలెక్టర్ జునూ హమాల్
మాట్లాడుతూ,పర్యాటకులు
చిక్కుకుపోయిన విషయాన్ని ధృవీకరించారు.వారిని సురక్షితంగా రక్షించేందుకు నేపాల్
ఆర్మీ మరియు స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగాయి.సహాయక బృందాలు వారి నివాస
స్థానాన్ని కనుగొని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi