భారత వాయుసేనలో కీలక పరిణామం
భారత వాయుసేనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (VCAS)గా నియమితులైన ఎయిర్ మార్షల్ ఇందర్పాల్ సింగ్ వాలియా ఆదివారం (నవంబర్ 1) న్యూఢిల్లీలో గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు.
Indian Air force


న్యూఢిల్లీ, 01 నవంబర్ (హి.స.)

భారత వాయుసేనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (VCAS)గా నియమితులైన ఎయిర్ మార్షల్ ఇందర్పాల్ సింగ్ వాలియా ఆదివారం (నవంబర్ 1) న్యూఢిల్లీలో గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. అధికారిక కార్యక్రమంలో వాయుసేన సిబ్బంది సంప్రదాయ సైనిక మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు.

దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సర్వీస్ ఉన్న వాలియా, ఇటీవలి వరకు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా వ్యవహరించారు.

1988 జూన్ 11న ఫైటర్ స్ట్రీమ్లో భారత వాయుసేనలో చేరిన వాలియా, MiG-21, MiG-23, MiG-27, Jaguar, Su-30 MKI వంటి యుద్ధ విమానాలను నడిపే అర్హత సాధించారు. 3,200 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఆయన సొంతం.

కెరీర్లో ఫ్రంట్లైన్ ఫైటర్ స్క్వాడ్రన్తో పాటు Tactics and Air Combat Development Establishment (TACDE)కు నాయకత్వం వహించారు. బరేలీ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్గానూ సేవలందించారు. పలు కీలక కమాండ్, స్టాఫ్ బాధ్యతల్లో రాణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande