
న్యూఢిల్లీ , 01 నవంబర్ (హి.స.)
దేశంలో
హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక
నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, పట్నా మీదుగా సిలిగురి మరియు గువాహటి
వరకు విస్తరించే ‘నార్తర్న్ బుల్లెట్ రైలు కారిడార్’ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.
ఈ
ప్రతిపాదిత హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాల
మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.ఢిల్లీ
నుంచి ఆగ్రాకు కేవలం 59 నిమిషాల్లో, కాన్పూర్‌కు గంటన్నరలోపు, లక్నోకు రెండు గంటల పది నిమిషాల్లో
ప్రయాణించవచ్చు.అలాగే వారణాసి నుంచి
ఢిల్లీకిమూడున్నర గంటల సమయం మాత్రమే పడుతుందని అంచనా వేశారు.ఈ కారిడార్ వల్ల వ్యాపారులు, విద్యార్థులు మరియు పర్యాటకులకు రవాణా
సదుపాయాలు సులభతరం కానున్నాయి.ముంబై-అహ్మదాబాద్
ప్రాజెక్టు తర్వాత దేశంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత కీలకమైన బుల్లెట్ రైలు
కారిడార్‌గా ఇది నిలవనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi