బంగాళాఖాతంలో కొత్త ముప్పు: ఒడిశాలో పునరావాస కేంద్రాలకు తరలింపు ఉత్తర్వులు
బంగాళాఖాతంలో కొత్త ముప్పు: ఒడిశాలో పునరావాస కేంద్రాలకు తరలింపు ఉత్తర్వులు
rain


భువనేశ్వర్, 01 నవంబర్ (హి.స.)

ఇటీవల

తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ బీభత్సం నుంచి తేరుకుంటున్న ఒడిశాను బంగాళాఖాతంలో ఏర్పడిన

మరో కొత్త వాయుగుండం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఇది ‘మురసు’ (Murasu) అనే తీవ్ర తుఫానుగా బలపడి ఆంధ్రప్రదేశ్

మరియు ఒడిశా తీరప్రాంతాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)

హెచ్చరించింది.

ఈ

తీవ్ర ముప్పు సంభవించనుండటంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.ముఖ్యంగా

గంజాం, గజపతి,

రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి వంటి ముప్పు ఉన్న దక్షిణ

ఒడిశా జిల్లాల్లో కలెక్టర్లు లోతట్టు ప్రాంతాలు, పెంకుటిల్లు మరియు తాత్కాలిక నివాసాల్లో

ఉంటున్న ప్రజలను సురక్షిత తుఫాను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారిక

ఉత్తర్వులు జారీ చేశారు.బాధితులకు అవసరమైన తాగునీరు, ఆహారం, అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించేందుకు

ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) మరియు NDRF బృందాలను రంగంలోకి దించారు.

వాతావరణ

శాఖ అంచనాల ప్రకారం, ఈ

కొత్త తుఫాను ప్రభావంతో నవంబర్ 2 నుంచి

4వ తేదీల మధ్య

ఒడిశాలోని పలు జిల్లాల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల

వేగంతో వీచే ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉంది.తీరం

అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకూడదని ఖచ్చితమైన

ఆదేశాలు జారీ చేశారు.గిరిజన, కొండప్రాంతాల్లో పర్యాటకుల సంచారాన్ని

తాత్కాలికంగా నిషేధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande