అరుణాచల్ ప్రదేశ్లో బుద్దుని పవిత్ర అవశేషాల దివ్య ప్రదర్శన
అరుణాచల్ ప్రదేశ్లో బుద్దుని పవిత్ర అవశేషాల దివ్య ప్రదర్శన
అరుణాచల్ ప్రదేశ్లో బుద్దుని పవిత్ర అవశేషాల దివ్య ప్రదర్శన


బొమ్‌డిలా, 10 నవంబర్ (హి.స.)

ఈశాన్య

భారతదేశంలో బౌద్ధ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను చాటిచెబుతూ అరుణాచల్ ప్రదేశ్‌లోని

బొమ్‌డిలాలో ఉన్న తుబ్‌చోగ్ గాట్సెల్ లింగ్ (TGL) మఠంలో శాక్యముని బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది.కేంద్ర సాంస్కృతిక

మంత్రిత్వ శాఖ,నేషనల్ మ్యూజియం,అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మరియు అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య

(IBC)

సంయుక్తంగా

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

తవాంగ్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక 'చినుక్' హెలికాప్టర్ ద్వారా ఈ పవిత్ర అవశేషాలనుబొమ్‌డిలాకు సురక్షితంగా

తరలించారు.అనంతరం స్థానిక మంత్రులు,బౌద్ధ భిక్షువులు మరియు సాయుధ బలగాలు గౌరవ వందనంతో ఈ దివ్య అవశేషాలను స్వీకరించి మఠంలో భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు.నవంబర్ 8 నుంచి నవంబర్ 13 వరకు ఈ పవిత్ర అవశేషాలను దర్శనం ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

ఈ దివ్య ప్రదర్శన ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే

సుమారు 12,000 మందికి పైగా భక్తులు,సన్యాసులు మఠాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా బౌద్ధ చరిత్ర

మరియు పవిత్ర అవశేషాల ప్రాముఖ్యతను తెలియజేసే

రెండు ప్రత్యేక ప్రదర్శనశాలలను కూడా ప్రారంభించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం

హిమాలయ ప్రాంత ప్రజల్లో శాంతి,సామరస్యం మరియు సాంస్కృతిక

మూలాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande