ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన – నాలుగు రాష్ట్రాలకు ఆదేశాలు
ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన – నాలుగు రాష్ట్రాలకు ఆదేశాలు
Supreme Court


ఢిల్లీ , 10 నవంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఢిల్లీలోని పూసా ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 392 మార్కును దాటగా, చాందినీ చౌక్, జాఫర్‌పూర్ ప్రాంతాలలో 380-390 మధ్య నమోదు కావడంతో నగరం దట్టమైన పొగమంచుతో అల్లుకుపోయింది. పెరిగిపోతున్న వాహనాల ఉద్గారాలే (Vehicular Emissions) ఈ పరిస్థితికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది.

​ఈ సమస్య పరిష్కారానికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) లో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు ఏమిటి, భవిష్యత్తులో తీసుకోబోయే అదనపు చర్యలేమిటో వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని నలుగురు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది.

​మరోవైపు, ఢిల్లీ హైకోర్టు కూడా ఒక కీలకమైన మధ్యంతర సడలింపు ఇస్తూ నిబంధనలను సవరించింది. కోర్టు పనిదినాల్లో న్యాయవాదులకు చెందిన నాన్-ఢిల్లీ ప్రీ-BS VI వాహనాలకు పార్కింగ్ స్టిక్కర్లు ఉన్నట్లయితే వాటికి జనవరి 2027 వరకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. స్థానిక యంత్రాంగం నగర వీధుల్లో వాటర్ స్ప్రింక్లర్లు మరియు యాంటీ-స్మాగ్ గన్‌ల ద్వారా నీటిని చిలకరిస్తూ దుమ్మును అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande