
ఢిల్లీ, 10 నవంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో జలమార్గాల పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యమునా నదిపై తొలి రికియేషనల్ (ఉల్లాసభరిత) నదీ క్రూయిజ్ సేవలను కేంద్ర నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అధికారికంగా ప్రారంభించారు. పశ్చిమ ఢిల్లీ సమీపంలోని సోనియా విహార్ మరియు జగత్పూర్ మధ్య ఈ క్రూయిజ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేశారు. 2016 జాతీయ జలమార్గాల చట్టం కింద యమునా నదిని 'నేషనల్ వాటర్వే-110'గా గుర్తించారు. అందులో భాగంగా ఈ నీటి రవాణా విధానాన్ని నగర పర్యాటకంలో భాగంగా అభివృద్ధి చేశారు. పర్యావరణహితమైన విద్యుత్ ఆధారిత (ఎలక్ట్రిక్) పడవలను ఈ క్రూయిజ్ కోసం ఉపయోగిస్తున్నారు.
సోనియా విహార్ నుంచి జగత్పూర్ వరకు సాగే ఈ క్రూయిజ్ ప్రయాణం ఢిల్లీ ప్రజలకు మరియు పర్యాటకులకు యమునా నదీ తీర అందాలను ఆస్వాదించే కొత్త అనుభవాన్ని అందిస్తుంది. పట్టణ రవాణా వ్యవస్థలో జలమార్గాల ప్రాముఖ్యతను పెంచడంతో పాటు యమునా నది ప్రక్షాళన, సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ క్రూయిజ్ సర్వీస్ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi