జనరిక్ మెడికల్ షాపుల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన మందులు.. కలెక్టర్ హరిత
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపును బుధవారం జిల్లా కలెక్టర్ కె. హరిత ప్రారంభించారు.
Collector


ఆసిఫాబాద్, 11 నవంబర్ (హి.స.)

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపును బుధవారం జిల్లా కలెక్టర్ కె. హరిత ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకట్, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కిరణ్ తో కలిసి ఆమె ఈ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, జనరిక్ మెడికల్ షాపుల ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జనరిక్ మందులపై 20 నుంచి 80 శాతం వరకు రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. ఖరీదైన మందులు కొనలేక ఇబ్బందులు పడే పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ షాపులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. రోగులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande