
అమరావతి , 12 నవంబర్ (హి.స.)విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సులో భాగంగా నిర్వహించిన ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్’లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ‘ది ఉమెన్ వీ విల్ షేప్ ది నెక్ట్స్ ఎకానమీ: లీడర్షిప్, కేపిటల్, యాంబిషన్’ అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీతో పాటు సీఐఐ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన అవకాశాలు, పెట్టుబడులు, మార్కెట్ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాల పెంపుపై ఈ వేదికలో విస్తృతంగా చర్చించారు. వివిధ రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషించేలా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు.
ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సంస్థకు చెందిన సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ చంద్రబాబు కృషిని ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఏపీ పురోగతికి కూడా చంద్రబాబు మార్గదర్శకత్వం దోహదపడిందన్నారు. 1996లో ఆయన సూచనలు, ప్రోత్సాహంతోనే భారత్ బయోటెక్‌ను స్థాపించినట్లు సుచిత్ర ఎల్ల వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్