
అమరావతి , 11 నవంబర్ (హి.స.)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపడుతోంది. సుమారు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులను ఒక కొలిక్కి తీసుకువచ్చే దిశగా కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా జగన్తో పాటు ఇతర నిందితులకు సంబంధించిన దాల్మియా, భారతీ సిమెంట్స్ కేసుల్లో ఛార్జిషీట్ల దాఖలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
గతంలో ఈ కేసులకు సంబంధించి ఈడీ ఛార్జిషీట్లు దాఖలు చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో న్యాయస్థానం వాటిని వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అనుమతులు, ఇతర సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి సారించారు.
ఇటీవల విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందంపై ప్రాసిక్యూషన్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా ఈ పరిణామాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జగన్ కేసులకు సంబంధించి ఈడీ తొమ్మిది ఛార్జిషీట్లు దాఖలు చేసింది. తదుపరి విచారణ ప్రక్రియలో జాప్యం లేకుండా, కోర్టులో కేసులు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్