
అమరావతి , 11 నవంబర్ (హి.స.)
మురసు తుపాను కారణంగా ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో జరిగిన నష్టంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. గృహ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయని అధికారులు ఆయనకు వివరించారు. మిగిలిన విద్యుత్ లైన్ల మరమ్మతులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్