
ఆదిలాబాద్, 11 నవంబర్ (హి.స.)
లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్-14, 17, 18 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు.
క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని, ఉన్నత స్థాయి పోటీల్లో రాణించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలుపొందిన వారు అహంకారానికి పోకుండా, ఓటమి ఎదురైన వారు నిరాశ చెందకుండా క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..