
అమరావతి , 12 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అపారమైన అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా పర్యాటకం, సముద్ర వాణిజ్యం, మత్స్య పరిశ్రమ రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న సహజ వనరులు, తీర ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని వివరించారు.
పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అద్భుతమైన టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. వీటి ద్వారా రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో నాలుగు గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. అలాగే ప్రస్తుతం రెండు ఫిషింగ్ హార్బర్లు ఉండగా, అదనంగా మరో ఏడు హార్బర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్