ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం.. బెయిల్ రద్దు చేయాలని ఈడీ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
Enforcement directorate


అమరావతి , 12 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇద్దరు నిందితులు బెయిల్పై బయట ఉంటే కేసు దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని ఈడీ తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సాక్షులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా విచారణకు ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ప్రస్తుతం ఈడీ దాఖలు చేసిన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్పై హైకోర్టు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ మద్యం కేసులో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande