
అమరావతి , 12 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషనర్ నేడు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకటనతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలుకానుంది.
ఈ ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్లకు, మరో 19 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి కార్పొరేషన్ల పరిధిలోని ఓటర్లు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. వీటితోపాటు మరో 19 మున్సిపాలిటీలు, పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు.
గతంలో వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు తొలగడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత నామినేషన్లు, ప్రచారం, పోలింగ్‌కు సంబంధించిన తేదీలపై స్పష్టత రానుంది.
ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటన కోసం అభ్యర్థులు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్