ధాన్యపు కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి.. ఎమ్మెల్యే ఏలేటి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన 83 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.83,09,628 చెక్కులను బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు.
Mla


నిర్మల్, 12 నవంబర్ (హి.స.)

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన 83 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.83,09,628 చెక్కులను బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు.

ఆలూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర సకాలంలో అందే విధంగా కొనుగోళ్లు వేగవంతంగా, పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

కేంద్రం నిధులతో జిల్లాకు 89 గోదాములు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande