తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సుమారు 15 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
Ttd


తిరుమల , 12 నవంబర్ (హి.స.)

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సుమారు 15 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల రాక పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అక్కడి నుంచి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.

ఇక నిన్న శ్రీవారిని మొత్తం 73,392 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు 33,288 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీకి రూ.3.90 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన సమయాలు, క్యూలైన్ల పరిస్థితిపై టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande