అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం.. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే రోడ్ల విస్తరణ ఎంతో కీలకమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
Mla


వనపర్తి, 12 నవంబర్ (హి.స.)

వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే రోడ్ల విస్తరణ ఎంతో కీలకమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.

గురువారం ఉదయం పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పొట్టి శ్రీరాములు చౌరస్తా పరిసర ప్రాంతాలలో చేపడుతున్న రహదారుల విస్తరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భవిష్యత్తులో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పట్టణంలో మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యమని తెలిపారు. విస్తరణ పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ అభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనులకు పట్టణ ప్రజలు, వ్యాపారులు మనస్ఫూర్తిగా సహకరించాలని, వనపర్తి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande