సమతామూర్తి ప్రాంగణంలో యతీంద్ర సప్తతి వైభవోత్సవాల ముగింపు
సమతామూర్తి ప్రాంగణంలో ఐదు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న యతీంద్ర సప్తతి ఉత్సవాలు నేడు ముగియి ప్రాంగణంలో ఐదు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న యతీంద్ర సప్తతి ఉత్సవాలు నేడు ముగియనున్నాయి.
సమతామూర్తి ప్రాంగణంలో యతీంద్ర సప్తతి వైభవోత్సవాల ముగింపు


హైదరాబాద్ , 12 నవంబర్ (హి.స.)

సమతామూర్తి ప్రాంగణంలో ఐదు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న యతీంద్ర సప్తతి ఉత్సవాలు నేడు ముగియి ప్రాంగణంలో ఐదు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న యతీంద్ర సప్తతి ఉత్సవాలు నేడు ముగియనున్నాయి. ఈ సందర్భంగా చివరి రోజు పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోదండరాముడికి 33వ ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, సంప్రదాయ పూజా కార్యక్రమాల మధ్య స్వామివారికి విశేష అభిషేక సేవ జరగనుంది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

యతీంద్ర సప్తతి వేడుకలు ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఈ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పలువురు ఆచార్యులు, వేద పండితులు, ఆధ్యాత్మిక ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. చివరి రోజు జరిగే కలశాభిషేకం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. యతీంద్ర సప్తతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande