శబరిమల యాత్రకు టీడీబీ భారీ ఏర్పాట్లు
శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల కోసం నిర్వహించే మండల-మకరవిళక్కు యాత్రకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సర్వం సిద్ధం చేస్తోంది.
SHABARAMALAI


ఢిల్లీ , 15 నవంబర్ (హి.స.)

శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల కోసం నిర్వహించే మండల-మకరవిళక్కు యాత్రకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న యాత్రలో భాగంగా 41 రోజుల పాటు ఆలయం భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై టీడీబీ అధ్యక్షుడు, కేరళ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. జయకుమార్ వివరాలు వెల్లడించారు. ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. భక్తులకు దర్శనం సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లపై దేవస్థానం బోర్డు దృష్టి సారించిందని తెలిపారు.

ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అయ్యప్ప మాలధారులు, సాధారణ భక్తులకు యాత్ర సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని జయకుమార్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande