జువైనల్ చట్టాల్లో మార్పులు చేయాలి: కేరళ హైకోర్టు
నేరాలకు పాల్పడుతున్న మైనర్ల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది.
IIIT-Bangalore-Students-Develop-AI-Tool-Nyaya-Setu-To-Identify-Pending-Court-Cases


ఢిల్లీ , 15 నవంబర్ (హి.స.)

నేరాలకు పాల్పడుతున్న మైనర్ల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా బాల నేరస్థుల వయసు పరిమితిని తగ్గించే అంశంపై చట్టసభలు దృష్టి సారించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు 16 ఏళ్ల వయసుకే మానసికంగా తగిన పరిణతి సాధిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో జువైనల్ న్యాయవ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడింది.

ప్రస్తుతం చట్టంతో విభేదించే బాలలుగా పరిగణించేందుకు 18 ఏళ్లలోపు వారిని మైనర్లుగా గుర్తిస్తున్నారు. అయితే ఈ వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే అంశాన్ని చట్టసభలు పరిశీలించాలని హైకోర్టు సూచించింది. మారుతున్న సామాజిక పరిస్థితులు, బాలల్లో పెరుగుతున్న అవగాహన, నేరాలకు పాల్పడుతున్న వారి వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అయితే జువైనల్ చట్టాల్లో సవరణలు చేయడం పూర్తిగా పార్లమెంట్, సంబంధిత చట్టసభల పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు మైనర్ నేరస్థులపై అమలవుతున్న చట్టాలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande