బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా ‘మురసు’: ఏపీ, తమిళనాడు తీరాలకు రెడ్ అలర్ట్!
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా ‘మురసు’: ఏపీ, తమిళనాడు తీరాలకు రెడ్ అలర్ట్!
rain


ఢిల్లీ , 02 నవంబర్ (హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుఫాన్ ప్రస్తుతం ప్రమాదకరంగా మారుతోంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఈ తుఫాన్ చెన్నైకి 260 కిలోమీటర్లు, నెల్లూరుకు 290 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి నెల్లూరు మరియు నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రతి గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల తీవ్ర వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉండటంతో పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదాన్ని నివారించేందుకు భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్ తో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande