‘మురసు’ తుఫాను ధాటికి తమిళనాడు అల్లకల్లోలం: చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు
‘మురసు’ తుఫాను ధాటికి తమిళనాడు అల్లకల్లోలం: చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు
rain


చెన్నై, 02 నవంబర్

(హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను

‘మురసు’ (Murasu) ప్రభావంతో

తమిళనాడు వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తీవ్ర వర్షాల కారణంగా

చెన్నై మరియు తిరువళ్లూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విద్యాసంస్థలకు స్థానిక యంత్రాంగం సెలవు

ప్రకటించింది.

భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం..తుఫాను తీరం వైపు పయనిస్తుండటంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు.రాజధాని చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు

రహదారులపై భారీగా నీరు చేరి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా

మారడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు.ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), స్థానిక విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగి నీరు నిలిచిన

ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని తోడే ప్రక్రియను చేపట్టాయి.అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రజలను తరలించేందుకు ప్రత్యేక పునరావాస

కేంద్రాలను కూడా సిద్ధం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande