రేపు హైదరాబాద్కు ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి సందీప్.. రెండు రోజుల పాటు కీలక సమావేశాలు
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఏఐసీసీ కొత్త రాష్ట్ర ఇన్ఛార్జి సందీప్ రేపు హైదరాబాద్కు రానున్నారు.
Aicc sandeep


హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఏఐసీసీ కొత్త రాష్ట్ర ఇన్ఛార్జి సందీప్ రేపు హైదరాబాద్కు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో గాంధీభవన్లో వరుస సమావేశాలకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్లో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, నాయకుల మధ్య సమన్వయంపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.

రేపు గాంధీభవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సభ్యులతో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి సందీప్ హాజరై పార్టీ ముఖ్య నేతలతో వివిధ అంశాలపై చర్చించనున్నారు.

అనంతరం ఎల్లుండి ఉదయం గాంధీభవన్లో రాష్ట్ర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రభుత్వ పనితీరు, పార్టీ కార్యక్రమాలు, ప్రజల్లో ప్రభుత్వానికి ఉన్న ఆదరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో మరో సమావేశం ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande