రెండో విడతలో 4,975 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు.. బరిలో 25 వేల మందికి పైగా అభ్యర్థులు
రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా మొత్తం 4,975 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Vote


అమరావతి , 22 నవంబర్ (హి.స.)రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా మొత్తం 4,975 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 4,975 పంచాయతీల్లో 25,413 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇక గ్రామాల్లోని వార్డు సభ్యుల స్థానాలకు కూడా తీవ్ర పోటీ నెలకొంది. రెండో విడతలో 49,318 వార్డులకు సంబంధించి మొత్తం 1,09,178 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో గ్రామస్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు.

ఈ నెల 29న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలపై దృష్టి సారిస్తున్నారు.

సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుండటంతో గ్రామాల్లో ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ రోజున ఓటర్లు ఏ విధమైన తీర్పు ఇస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande