వ్యక్తిగత బంధాలను కూడా అవమానిస్తారా?.. సాక్షి కథనాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
షర్మిల కుమార్తె వివాహానికి ఆహ్వానం అందిన నేపథ్యంలో తనపై, కుటుంబ సంబంధాలపై వస్తున్న వార్తలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
Chandrababu Naidu


అమరావతి , 21 నవంబర్ (హి.స.)

షర్మిల కుమార్తె వివాహానికి ఆహ్వానం అందిన నేపథ్యంలో తనపై, కుటుంబ సంబంధాలపై వస్తున్న వార్తలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పెళ్లి ఆహ్వాన పత్రిక అందిస్తే సొంత చెల్లిపై ఇష్టానుసారంగా కథనాలు రాస్తారా? అంటూ సాక్షి పత్రిక ప్రచురిస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు వార్తలు రాసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్రెడ్డితో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉండేవని గుర్తుచేశారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత బంధాలు, మానవ సంబంధాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత సంబంధాలకు ముడిపెట్టి బంధాలను కించపరచడం సరికాదని అన్నారు.

మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షం తప్పుడు ప్రచారంతో అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విధ్వంసకర రాజకీయాలే గొడ్డలి పార్టీ చరిత్రగా మిగిలాయని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande