శంషాబాద్లో హైడ్రా భారీ చర్యలు.. 75 ఎకరాల చెరువు భూమి స్వాధీనం
హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో హైడ్రా అధికారులు ఆక్రమణలపై చర్యలు చేపట్టారు. తొండుపల్లి చెరువుకు సంబంధించిన సుమారు 75 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు.
శంషాబాద్లో హైడ్రా భారీ చర్యలు.. 75 ఎకరాల చెరువు భూమి స్వాధీనం


హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)

హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో హైడ్రా అధికారులు ఆక్రమణలపై చర్యలు చేపట్టారు. తొండుపల్లి చెరువుకు సంబంధించిన సుమారు 75 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు.

చెరువు పరిధిలోని భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు, ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సంబంధిత ప్రాంతాల్లో నిర్మాణాలు, ఇతర ఆక్రమణలను తొలగించారు. అనంతరం సుమారు 75 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మళ్లీ ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. చెరువులు, వాటి పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత శాఖలతో కలిసి పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. శంషాబాద్లో హైడ్రా చేపట్టిన ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande