పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి : ఎంపీ రఘునందన్ రావు
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ డివిజన్ లోని ఇందిరానగర్ బస్తీ దవాఖానలో ఆదివారం మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Mp


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ డివిజన్ లోని ఇందిరానగర్ బస్తీ దవాఖానలో ఆదివారం మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా చుక్కలు వేసి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి పిల్లలే రేపటి భారత పౌరులని, వారు ఆరోగ్యంగా ఎదిగితేనే బలమైన దేశం తయారవుతుందన్నారు. పోలియో అనే మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని చెప్పారు. 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పకుండా చుక్కలు వేయించాలని కోరారు.

పోలియో నివారణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి తల్లిదండ్రుల బాధ్యత కూడా అని అన్నారు. ఒక్కసారి ఈ వ్యాధి సోకితే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని, అందుకే ముందస్తు జాగ్రత్తగా చుక్కలు వేయించడం చాలా అవసరమని తెలిపారు. తమ పిల్లలకే కాకుండా పక్కింటి వారికి కూడా ఈ విషయం చెప్పి అవగాహన కల్పించాలని సూచించారు. ఏ చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరికీ చుక్కలు అందేలా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande